కొండగట్టులో కనీస అవసరాలకు కూడా దిక్కు లేదు, కాంగ్రెస్ నాయకుల నిరసన

Apr 9, 2022, 3:21 PM IST

 కాంగ్రెస్ నాయకులు పాదయాత్ర గా వచ్చి దిగువ కొండగట్టు నుండి, కొండగట్టు ఆలయం వైపు వెళ్తున్న క్రమంలో పోలీసులు వారిని అడ్డుకున్నారు, కొండగట్టు వై జంక్షన్ వద్ద కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు దూసుకెళ్లిన క్రమంలో పోలీసులకు కాంగ్రెస్ నాయకుల మధ్య తోపులాట జరిగింది, ఈ సందర్భంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కొండగట్టు ఆంజనేయ స్వామి అభివృద్ధికి అడ్డంకులు సృష్టిస్తుందని ప్రభుత్వం నిధులు కేటాయించాలని అలాగే భక్తులకు వసతి కల్పించాలని కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తే అడ్డుకునే ప్రయత్నం చేస్తుందని అన్నారు, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆలయాలపై మాట్లాడుతాడు కానీ కొండగట్టు ఆలయం గురించి మాత్రం అభివృద్ధి గురించి మాత్రం లేవనెత్తాడు, ఎమ్మెల్సీ కవిత కొండగట్టు లో హనుమాన్ చాలీసా కార్యక్రమాన్ని మొదలు పెట్టి అభివృద్ధి చేస్తామని ఇప్పటివరకు ఎన్నో సార్లు చెప్పినప్పటికీ కనీస సౌకర్యాలు లేక వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అన్నారు, ఎక్కడలేని విధంగా కొండగట్టు లో ఆంజనేయస్వామి ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందిందని తెలంగాణ వచ్చాక అయినా అభివృద్ధి జరుగుతుందని ఆశించిన భక్తులకు నిరాశ ఎదురైంది అని దీనికి నిరసనగా ఈ రోజు కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపడితే పోలీసులు అడ్డుకోవడం ఎంతవరకు సమంజసమని పొన్నం ప్రభాకర్ అన్నారు, వీరితో పాటు చొప్పదండి నియోజకవర్గ ఇన్చార్జి మేడిపల్లి సత్యం తదితరులు పాల్గొన్నారు.