గణతంత్ర భారతంలో గరీబోళ్ల బ్రతుకులింతే...

Jan 26, 2022, 1:23 PM IST

జగిత్యాల: 73ఏళ్ల స్వాత్రంత్ర్య భారతం... గణతంత్ర దేశం... అతిపెద్ద ప్రజాస్వామ్యం...  అభివృద్ది దిశగా వడివడిగా సాగుతున్న దేశం... ఇవన్నీ భారతదేశం గురించి గొప్పగా చెపుకునే మాటలు. కానీ ఇదే దేశంలో పొట్టకూటి ఈ చిన్నారి ఏ చేస్తుందో చూడండి. బడికి వెళ్లి చదువుకోవాల్సిన వయసులు కుటుంబ పోషణ కోసం ప్రాణాలకు తెగిస్తూ తాడుపై నడుస్తోంది ఈ చిన్నారి. ఈ ఘటన భారతదేశంలో పేదవాడి బ్రతుకు ఎలా వుందో తెలియజేస్తుంది. రిపబ్లిక్ డే రోజున జగిత్యాల జిల్లా ధర్మపురిలో జాతిపిత గాందీజీ విగ్రహం ఎదుటే ఓ నాలుగేళ్ల చిన్నారిని తాడుపై నడిపిస్తూ కుటుంబం యాచించుకుంటున్నారు.