కేసీఆర్ కటౌట్ కు రాఖీలు కట్టి... సోదర ప్రేమను చాటుకున్న కరీంనగర్ మహిళలు

Aug 12, 2022, 4:55 PM IST

కరీంనగర్ : సోదర సోదరీమణులు ప్రేమానురాగాలతో జరుపుకునే పండగ రక్షాబంధన్. అయితే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై తమ సోదర ప్రేమను వినూత్నంగా వ్యక్తపర్చారు కరీంనగర్ కు చెందిన టీఆర్ఎస్ మహిళా నాయకులు. పట్టణంలోని తెలంగాణ చౌక్ వద్ద సీఎం కేసీఆర్ నిలువెత్తు కటౌట్ ఏర్పాటుచేసి దానికే మహిళలు, చిన్నారులు రాఖీ కట్టి తన ప్రేమను చాటుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి గంగుల కమలాకర్ కు కూడా మహిళలు రాఖీ కట్టారు.