సీఎం కేసీఆర్ సన్నిహితుడు అరెస్ట్... కరీంనగర్ లో ఉద్రిక్తత

Aug 24, 2022, 5:03 PM IST

కరీంనగర్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సన్నిహితుడు, ఇటీవల ఆయనతో కలిసి డిల్లీకి వెళ్లిన కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్ ను పోలీసులు అరెస్ట్ చేసారు. కొద్దిరోజుల క్రితం జరిగిన స్థానికసంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు అవకాశం వస్తుందని ఆశించి భంగపడ్డ సర్దార్ సింగ్ టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఎన్నికల కోడ్ అమల్లో వుండగా అధికార పార్టీ అభ్యర్థులు ఇచ్చే డబ్బులు తీసుకోవాలి... ఓటు మాత్రం తనకే వేయాలని స్థానిక సంస్థల నాయకులను కోరాడు. ఈ వ్యాఖ్యలపై ఫిర్యాదులు అందడంతో అప్పుడే కేసులు నమోదుచేసిన పోలీసులు తాజాగా సర్దార్ రవీందర్ సింగ్ ను అరెస్ట్ చేసారు. రవీందర్ సింగ్ అరెస్ట్ గురించి తెలిసి కరీంనగర్ వన్ టౌన్ పోలీస్టేషన్ కు ఆయన అనుచరులు చేరుకుని ఆందోళనకు దిగారు. అయితే అరెస్ట్ చేసిన కొద్దిసేపటికే రవీందర్ సింగ్ ను సొంత పూచీకత్తుపై విడుదల చేసారు పోలీసులు. దీంతో ఆయన అనుచరులు ఆందోళన విరమించారు.