Apr 5, 2022, 5:02 PM IST
కరీంనగర్: పుష్ఫ సినిమా చివర్లో కనిపించే పోలీస్ ఆఫీసర్ భన్వర్ సింగ్ షెకావత్ మీకు గుర్తున్నాడా..? నున్నటి గుండుతో వాహనాలను ఆపుతున్న ఈ ట్రాఫిక్ పోలీస్ సేమ్ సేమ్ టు సేమ్ ఆయనలాగే వున్నాడు కదా. ఇలా పుష్పలో ఫహద్ ఫాసిల్ డిపరెంట్ గెటప్ లో రీల్ పోలీసుగా కనిపిస్తే కరీంనగర్ రోడ్లపై ఈ రియల్ పోలీస్ కనిపిస్తున్నాడు. కరీంనగర్ ట్రాఫిక్ విధుల్లో వున్న ఈ పుష్ప సినిమా పోలీస్ ఆఫీసర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పుష్ఫ సినిమాలోని ఫహల్ ఫాసిల్ గెటప్ తో కనిపించే కరీంనగర్ ట్రాఫిక్ పోలీస్ శ్రీనివాస్ తో ఫోటోలు,సెల్ఫీ దిగేందుకు స్థానికులు ఇష్టపడుతున్నారు. ఆయన రోడ్డుపై కనిపిస్తే భన్వర్ సింగ్ షెకావత్ అంటూ పిలిచేవారు వున్నారు. ఆయన నోటినుండి ''పార్టీ లేదా పుష్ప'' డైలాగ్ వినాలని మరికొందరు ఇష్టపడుతున్నారు. ఏదేమయినా పుష్ప సినిమా తర్వాత ప్రజలు తనకు మంచి గుర్తింపు లభించిందని... సెల్పీలు దిగుతుంటే సంతోషంగా వుందని కానిస్టేబుల్ శ్రీనివాస్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.