తెలుగురాష్ట్రాల్లో ఒకేఒకటి... కరీంనగర్ కమీషనరేట్ కు అరుదైన గుర్తింపు

Jul 9, 2022, 4:13 PM IST

కరీంనగర్ : తెలంగాణ పోలీసులు పనితీరుకు అరుదైన గుర్తింపు లభించింది. కరీంనగర్ జిల్లా కమీషనరేట్ కార్యాలయానికి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్ (ఐఎస్ఓ) గుర్తింపు లభించింది. ఈ విషయాన్ని స్వయంగా కరీంనగర్ కమీషనర్ వి సత్యనారాయణ ప్రకటించారు. ఐఎస్ఓ ప్రతినిధులు ఇవాళ (శనివారం) కమీషనర్ కు దృవీకరణ పత్రం అందజేసారు. కరీంనగర్ కమీషనరేట్ పరధిలో పోలీసుల పనితీరు, బాధితులకు అందుతున్న న్యాయం, పోలీస్ స్టేషన్ల నిర్వహణ తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని ఐఎస్ఓ సర్టిఫికికేట్ లభించిందని అన్నారు. దీంతో తమపై బాధ్యత మరింత పెరిగిందని... ఇకపై కూడా పోలీసుల పనితీరు ఇలాగే అద్భుతంగా వుండాలని కమీషనర్ సత్యనారాయణ సూచించారు.