ఈటలను బిజెపి పక్కనబెట్టడానికి కారణం టీఆర్ఎసే..: కరీంనగర్ మేయర్ వ్యాఖ్యలు

Mar 29, 2022, 4:09 PM IST

కరీంనగర్: బీజెపి, కాంగ్రెస్ పార్టీల అపవిత్రమైన కలయికవల్లే హుజురాబాద్ లో ఈటల రాజేందర్ గెలిచారని కరీంనగర్ మేయర్ సునీల్ రావు అన్నారు. ఇలాంటి గెలుపును చూసుకుని ఆయనకు అహంకారం నెత్తికెక్కిందని... టీఆర్ఎస్ నేతల సంగతి చూస్తానంటూ బెదిరింపులకు దిగుతున్నాడని అన్నారు. ఈటల టీఆర్ఎస్ లో వుండగా గోతికాడి నక్కలా పార్టీకి వెన్నుపోటు పొడవాలని చూసాడని... ఇది తెలుసు కాబట్టే బిజెపి కూడా ఆయనను పక్కన పెట్టిందన్నారు. ఇలాగే విర్రవీగితే ప్రజల ఈటలకు గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు. టీఆర్ఎస్ పార్టీ, నాయకుల గురించి ఇష్టంవచ్చినట్లు మాట్లాడితే ఊరుకోబోమని... తాము కూడా తగిన గుణపాఠం చెబుతామని మేయర్ సునీల్ హెచ్చరించారు.