Feb 15, 2021, 10:49 AM IST
కరీంనగర్: ప్రజల తీర్పును కాంగ్రెస్, బీజేపీ అపహస్యం చేస్తూ తామే అధికారంలోకి వచ్చినట్లు కాంగ్రెస్, బీజేపీ నేతలు ముందస్తుగా పగటి కలలు కంటున్నారని కరీంనగర్ మేయర్ సునీల్ రావు మండిపడ్డారు. లేని...రాని అధికారం కోసం బీజేపి, కాంగ్రెస్ నాయకుల ఆరాటం చెందుతున్నారన్నారు. కాంగ్రెస్ లో మూడు ముక్కలటా నడుస్తోందని... వ్యక్తిగత లాభం కోసం రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్కలు యాత్రలు చేస్తున్నారన్నారు. కాంగ్రెస్, బీజేపీలకు ఢిల్లీలో స్విచ్ వేస్తే ఇక్కడ లైట్ వెలుగుతుందని అన్నారు. మంత్రి పదవి ఇచ్చినా ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన చరిత్ర జీవన్ రెడ్డిదని సునీల్ రావు ఎద్దేవా చేశారు.