భర్త అనుమానిస్తున్నాడని.. వివాహిత ఆత్మహత్యాయత్నం

Aug 22, 2020, 2:11 PM IST

కరీంనగర్ పెద్దమ్మ కాలనీలోని ఓ వివాహితను భర్త తరచుగా వివాహేతర సంబంధం ఉందంటూ వేధిస్తుండడంతో ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది.  లోయర్ మానేరు డ్యామ్ సమీపంలో ఆమెను గమనించిన లేక్ అవుట్ పోస్ట్ పోలీసులు వివరాలు అడగగా విషయం బైటికి వచ్చింది. పోలీసులు ఆమె ప్రయత్నాన్ని అడ్డుకుని ఆమె తల్లి, సోదరుడికి అప్పగించారు. భర్తకు, ఆమెకు కౌన్సిలింగ్ చేసి ఇంటికి పంపించారు.