మళ్లీ బుల్లెట్ బండి సాంగ్ వైరల్... కరీంనగర్ జాయింట్ కలెక్టర్ దంపతులు అదిరిపోయే స్టెప్పులతో

Nov 15, 2021, 3:17 PM IST

బుల్లెట్ బండి పాట ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం. ప్రమఖ గాయని మోహన బోగరాజు ఆడిపాడిన ఈ ప్రైవేట్ సాంగ్ పెళ్లిళ్లలో మారుమోగుతోంది. నీ బుల్లెట్ బండెక్కి వచ్చెతాపా డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గాని... అంటూ తెలంగాణ యాసలో సాగే ఈ పాట అందరినీ ఆకట్టుకోవడంతో ఎక్కడో ఒక దగ్గర వినబడుతూనే ఉంది. తాజాగా ఈ బుల్లెట్ బండి పాటపై జాయింట్ కలెక్టర్ దంపతులు డ్యాన్స్ చేయడం మరోసారి ఈ పాట వైరల్ గా మారింది. నిన్న(ఆదివారం) కరీంనగర్ జిల్లా జాయింట్ కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్ పుట్టినరోజు. ఈ సందర్భంగా క్యాంప్ కార్యాలయంలో కుటుంబసభ్యులు, బంధువులు, సన్నిహితుల మధ్య పుట్టినరోజు వేడుక జరిగింది. ఈ సందర్భంగా శ్యామ్ ప్రసాద్ లాల్ తన భార్యతో కలిసి బుల్లెట్ బండి పాటకి స్టెప్పులేసారు.