Sep 10, 2022, 4:09 PM IST
హైదరాబాద్ : తెలంగాణ ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి వేడుక సీఎం కేసీఆర్ కూతురు, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇంట ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని తన నివాసంలో కాళోజి చిత్రపటానికి పూలమాల వేసిన కవిత నివాళులు అర్పించారు. అనంతరం కాళోజి పురస్కారం-2022 కు ఎంపికయిన యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరుకు చెందిన ప్రముఖ కవి శ్రీరామోజు హరగోపాల్ ను కవిత సన్మానించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ కాళోజీ తెలంగాణ సాహిత్యానికి చేసిన సేవను గుర్తుచేసారు. ఆయన గొప్పతనాన్ని తెలంగాణ సమాజానికి తెలియజేయాలని నిర్ణయించామని... ఇందులో భాగంగా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో 15,16 తేదీల్లో సాహిత్య సభలు నిర్వహించనున్నట్లు కవిత ప్రకటించారు.