Apr 14, 2023, 6:25 PM IST
జగిత్యాల : అంబేద్కర్ విగ్రహం ఎదుటే ఓ దళిత రైతు న్యాయం దక్కడంలేదంటూ ఆవేదన వ్యక్తం చేసాడు. అంబేద్కర్ జయంతి వేడుకల కోసం వచ్చిన అధికార పార్టీ ఎమ్మెల్యే, ప్రతిపక్ష ఎమ్మెల్సీని రైతు నిలదీసిన ఘటన జగిత్యాల జిల్లాలో జరిగింది.
అంబేద్కర్ జయంతి సందర్భంగా జగిత్యాల పట్టణంలో ఏర్పాటుచేసిన అంబేద్కర్ విగ్రహాన్ని స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ క్రమంలోనే ఓ దళిత రైతు తనకు న్యాయం దక్కడంలేదంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. తమ భూమి సమస్య గత కొన్ని ఏండ్లుగా పరిష్కరించకుండా అధికారులు చుట్టూ తింపుకుంటున్నారని గోడు వెళ్ళబోసుకున్నాడు. ఆగ్రహంతో తన భూమి పట్టా పాస్ బుక్కులను ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ముందే పడేసి కాల్చివేయడానికి సిద్దమయ్యాడు. వెంటనే అక్కడుకున్నవారు, పోలీసులు అతడికి సర్దిచెప్పి అక్కడినుండి పంపించారు.