ఉస్మానియా ఆసుపత్రిలో డాక్టర్ పై దాడి.. ఖండించిన మెడికల్ అసోసియేషన్..

Apr 15, 2020, 5:48 PM IST

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కోవిద్ 19 విజృంభిస్తున్న వేళ వైద్యులు తమ ప్రాణాలను సైతం పక్కనపెట్టి సపర్యలు చేస్తూ ఉంటే కొందరు మూర్ఖులు వైద్యులపై దాడులు చేయడం అమానుషమని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ విజయేందర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. కరీంనగర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఉస్మానియాలో వైద్యుల పై జరిగిన దాడులను ఆయన తీవ్రంగా ఖండించారు.