Aug 15, 2023, 3:10 PM IST
హైదరాబాద్ : ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయడు మనవడు దేవాన్ష్ తో కలిసి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. హైదరాబాద్ లోని తన నివాసంలోనే 77వ స్వాతంత్య్ర వేడుకలు జరుపుకున్నారు చంద్రబాబు. మనవడు దేవాన్ష్ ను తీసుకుని ఇంట్లోంచి బయటకు వచ్చిన చంద్రబాబు మొదట జాతిపిత గాంధీజీ ఫోటో వద్ద కొబ్బరికాయ కొట్టి పుష్పాంజలి ఘటించారు. దేవాన్ష్ కూడా జాతిపితకు దండం పెట్టుకున్నాడు. అనంతరం చంద్రబాబు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుని సిబ్బందికి మిఠాయిలు పంచిపెట్టారు.