Apr 2, 2020, 4:33 PM IST
కరోనావైరస్ నుండి రక్షణ కోసం హైదరాబాద్ కు చెందిన రీసెర్చర్ శ్రవణ్ గట్టు కళ్ళు, ముక్కు, చెవులు, నోరు, హెయిర్ ఇలా తల అంతటిని కవర్ చేసే రీయూజబుల్ మాస్క్ ను తయారు చేశారు. మామూలు మాస్కులు ముక్కు, నోరును కవర్ మాత్రమే కవర్ చేస్తున్నాయని..అయితే 0.1 మైక్రాన్ల అతి సూక్ష్మమైన వైరస్ చెవులు, కళ్లద్వారా కూడా శరీరంలోకి ప్రవేశిస్తాయని అందుకే తాను తయారుచేసిన మాస్క్ రిస్క్ లేనిదని చెబుతున్నారు. ప్రభుత్వం సహకరిస్తే తక్కువధరలో తయారుచేసి అందిస్తానని చెబుతున్నారు.