హైదరబాదీ ఔత్సాహిక పరిశోధకుడు శ్రవణ్ గట్టు తాను తయారుచేసిన రీ యూజబుల్ మాస్కులను పోలీసులు, శానిటేషన్ వర్కర్లు, వైద్యులకు అందజేశాడు. కరోనావైరస్ నుండి రక్షణ కోసం హైదరాబాద్ కు చెందిన రీసెర్చర్ శ్రవణ్ గట్టు కళ్ళు, ముక్కు, చెవులు, నోరు, హెయిర్ ఇలా తల అంతటిని కవర్ చేసే రీయూజబుల్ మాస్క్ ను తయారు చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వం సహాయం చేస్తే పెద్ద ఎత్తున తయారు చేస్తానన్న శ్రవణ్.. ఇప్పుడున్న పరిస్థితుల నేపధ్యంతో తానే స్వయంగా తయారుచేసి పంచాడు.