Oct 14, 2022, 11:50 AM IST
హైదరాబాద్ : కఠినంగా, కర్కశంగా వుంటారు... నిబంధనలు, చట్టాల పేరిట ప్రజలను భయపెట్టి దోచుకుంటారనే అపవాదు పోలీసులపై వుంది. అయితే పోలీసుల్లోనూ జాలి, దయ కలిగిన మనసున్నవారు కూడా వుంటారని హైదరాబాద్ పోలీసులు నిరూపించారు. సాధారణంగా అయితే అక్రమంగా దేశంలో నివాసముండే విదేశీయులను జైలుకు పంపి శిక్షిస్తుంటారు.... కానీ హైదరాబాద్ లో అక్రమంగా నివాసముంటున్న సూడాన్ దేశస్తుడితో పోలీసులు అలా వ్యవహరించలేదు. అతడు ఇలా ఎందుకు వుండాల్సి వచ్చిందో తెలుసుకున్న పోలీసులు స్వదేశానికి వెళ్లడానికి సహకరించారు. విమానాశ్రయానికి వెళ్లిమరీ అతడికి వీడ్కోలు పలికి జాగ్రత్తగా వెళ్లాలని సూచించారు. ఇలా తెలంగాణ పోలీస్ విదేశీయుడిని నిబంధనల పేరిట హింసించకుండా తోచిన సాయం చేసి ప్రెండ్లీ పోలీసులమని నిరూపించుకున్నారు.