Huzurabad Bypoll:ఇల్లంతకుంటలో ఉద్రిక్తత... ప్రలోభాలకు గురిచేస్తున్న టీఆర్ఎస్ నేతను అడ్డుకున్న గ్రామస్తులు

Oct 30, 2021, 10:14 AM IST

కరీంనగర్:  హుజురాబాద్ ఉపఎన్నిక ప్రచార గడువు ముగిసినతర్వాత కూడా ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్న టీఆర్ఎస్ నాయకున్ని గ్రామస్తులు అడ్డుకున్నారు. ఇల్లంతకుంట‌ మండలం శ్రీరాములపల్లి గ్రామంలో ఓటర్లను  ప్రలోబాలకు గురిచేస్తున్న TRS ఇంచార్జ్, గజ్వెల్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ మాదాసు శ్రీనివాస్ ను గ్రామస్తులు అడ్డుకున్నారు. ఆయనతో వాగ్వాదానికి దిగడంతో కాస్సేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది.