Huzurabad Bypoll:సిద్దిపేట, సిరిసిల్లలా హుజురాబాద్... గెల్లును గెలిపిస్తే: మంత్రి గంగుల

Oct 3, 2021, 4:23 PM IST


హుజురాబాద్: ఇవాళ(ఆదివారం) ఉదయం హుజురాబాద్ పట్టణంలో టీఆర్ఎస్ పార్టీ తరపున ప్రచారం నిర్వహించారు మంత్రి గంగుల కమలాకర్. స్థానిక ప్రజలతో కలిసి బోర్నపల్లితో పాటు ఇతర ప్రాంతాల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ కి ఓటేయాలంటూ ప్రచారం చేశారు.  

ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ... తాజా మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పూర్తి నిర్లక్ష్యంతో హుజురాబాద్ పట్టణంలోని 350 రోడ్లలో కనీసం మూడు రోడ్లను కూడా సరిగా వేయలేదన్నారు. స్థానికులు చెప్పులరిగేలా ఈటెల చుట్టూ తిరిగి దరఖాస్తులు ఇచ్చినా స్పందించకపోవడం దారుణమన్నారు. కరీంనగర్, సిరిసిల్ల, సిద్దిపేటలు డెవలప్ అయినట్టుగా ఇక్కడ డెవలప్ ఎందుకు చేయలేదని అన్నారు. ఐటీతో పాటు అన్నిరకాల కంపెనీలు ఈ మూడు పట్టణాలకు వస్తున్నాయని... అదే మాదిరిగా ఇక్కడికి సైతం అభివృద్ధిని తీసుకురావడానికి ఎన్ని కోట్లైనా ఖర్చుపెట్టడానికి సీఎం కేసీఆర్ సిద్దంగా ఉన్నారన్నారు.