Oct 1, 2021, 6:49 PM IST
కరీంనగర్: హుజురాబాద్ ఉపఎన్నిక సందర్భంగా తనను బద్నాం చేయడానికే దళితబంధు ఆపాలంటూ తాను లేఖ రాసినట్లుగా టీఆర్ఎస్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తోందని మాజీ మంత్రి, బిజెపి నాయకులు ఈటల రాజేందర్ అన్నారు. మీరంతా ఫేక్ గాళ్లు అంటూ టీఆర్ఎస్ నాయకులపై ఈటల మండిపడ్డారు. తనది రోశంగల్ల పుట్టుక... అలాంటి తాను మళ్లీ కాళ్ళు మెక్కుతా బాంచన్ అని సీఎంకి లేఖ రాస్తానా? అన్నారు.
సీఎం కేసీఆర్ కు మానవత్వమే కాదు నీతి జాతి కూడా లేదని ఈటల ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ధర్మంతో గొక్కున్నాడు... మూల్యం చెల్లించించుకోక తప్పదు అని ఈటల రాజేందర్ హెచ్చరించారు.