Oct 30, 2021, 11:31 AM IST
హుజురాబాద్: గణుముక్కలలో టీఆర్ఎస్, బిజెపి వర్గాల మధ్య వాగ్వివాదం చోటు చేసకుంది. టీఆర్ఎస్ నాయకుడు కౌశిక్ రెడ్డి పోలింగ్ కేంద్రంలో ప్రచారం చేస్తున్నారంటూ... స్థానికేతరులకు ఇక్కడేం పని అంటూ బిజెపి కార్యకర్తలు విమర్శిస్తున్నారు. బిజెపి నాయకుల నినాదాలతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. కౌశిక్ రెడ్డితో బిజెపి నాయకులు వాగ్వివాదానికి దిగారు. దీంతో కౌషిక్ రెడ్డి వెళ్లిపోవడంతో వివాదం సద్దుమణిగింది.