Oct 27, 2021, 3:33 PM IST
కరీంనగర్: హుజురాబాద్ ఉపఎన్నికలో మరో కీలక ఘట్టానికి నేటి(బుధవారం)తో తెరపడనుంది. అక్టోబర 30న పోలింగ్ జరగనున్న నేపథ్యంలో 48గంటల ముందుగానే ప్రచారాన్ని నిలిపివేయాలని ఈసీ ఆదేశించింది. దీంతో ఇంతకాలం జోరుగా సాగిన ప్రచారపర్వం నేటి సాయంత్రం ముగియనుంది.
దీంతో బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్ చివరిరోజు వీలైనన్ని ఎక్కువ గ్రామాల్లో ప్రచారాన్ని చేపడుతున్నారు. ఇలా పెద్దపాపయ్య పల్లిలో ఎన్నికల ప్రచారాని బిజెపి నాయకురాలు డీకే అరుణతో కలిసి వెళ్లిన ఈటలకు ఘనస్వాగతం లభించింది. మహిళలు కోలాటాలతో వారికి స్వాగతం పలికారు.