భారీ వర్షాలతో ఉప్పొంగిన జంగల్ నాల్ ప్రాజెక్ట్... కుప్పలు కుప్పలుగా చేపలు

Jul 11, 2022, 2:56 PM IST

తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలతో నదులు, చెరువులు, వాగులువంకలు జలకళను సంతరించుకున్నాయి. వరదనీరు భారీగా చేరుతుండటంతో జలాశయాలు నిండుకుండల్లా మారాయి. ఇలా జగిత్యాల జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో వెల్గటూరు మండలం జగదేవపేట జంగల్ నాల్ ప్రాజెక్టులో నీరు మత్తడి దుంకుతోంది. దీంతో ప్రాజెక్ట్ లోని చేపలు కుప్పలుతెప్పలుగా బయటకు వస్తున్నాయి. ఇలా నీటిలో కొట్టుకుని వస్తున్న చేపలు తిరిగి ప్రాజెక్ట్ లోకి వెళ్లేందుకు ప్రవాహానికి వ్యతిరేకంగా ఈదే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే మత్స్యకారులు నీటిలో కొట్టుకుపోతున్న చేపలను పడుతున్నారు. ఇలా కుప్పలు కుప్పలగా చేపలు ప్రాజెక్ట్ లోంచి బయటకు రావడాన్ని స్థానికులు ఆశ్చర్యంగా చూస్తున్నారు.