Feb 15, 2021, 2:59 PM IST
ఆదిలాబాద్: తెలంగాణ గిరిజన బిడ్డలు ఎంతో భక్తిశ్రద్దలతో జరుపుకునే నాగోబా జాతర ఇటీవలే ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నాగోబాను దర్శించుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారికి మెస్రం వంశీయుల ఆధ్వర్యంలో స్వాగతం పలికారు. ఆలయ సాంప్రదాయం ప్రకారం మెస్రం వంశీయులు వారిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ సోయం బాపురావు, కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఐటీడీఏ పీవో బవేష్ మిశ్రా, తదిరులు ఉన్నారు.