Sep 12, 2022, 10:36 AM IST
పెద్దపల్లి : తెలంగాణలో గత రెండుమూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో నదులు, వాగులు వంకలు ఉప్పొంగి వరద నీరు జనావాసాలను ముంచెత్తుతోంది. ఇలా పెద్దపల్లిలో కురుస్తున్న భారీ వర్షంతో రోడ్లన్ని జలమయం అయ్యారు. పట్టణంలోని లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రోడ్లపైకి వరదనీరు చేరి ఉదృతంగా ప్రవహిస్తుండటంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.