Jul 10, 2022, 1:54 PM IST
తెలంగాణలో గత రెండ్రోజులుగా వర్షం దంచికొడుతోంది. ఇలా నిర్మల్ పట్టణంలోనూ ఎడతెరిపిలేకుండా భారీ వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు కాలనీలు నీటమునిగి ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. దీంతో ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు మంత్రి ఆలోళ్ల ఇంద్రకరణ్ రెడ్డి పట్టణంలో వర్ష ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. మోకాళ్ల లోతు నీటిలోనూ ప్రజలవద్దకు వెళ్లి సమస్యలు తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలోనే శాంతినగర్ చౌరస్తాలో రోడ్డుపై నిలిచిన వర్షపు నీటిని మంత్రి పరిశీలించారు. రోడ్లపై ఇలా నీరు నిలవకుండా చూడాలని... ఇకపై ఇలాంటి సమస్య నగరంలో ఎక్కడా తలెత్తకుండా డ్రైనేజీల్లో ఎప్పటికప్పుడు చెత్తను తొలగించాలని సూచించారు.