Aug 11, 2022, 10:54 AM IST
నిర్మల్ : భారతదేశానికి స్వాతంత్య్రం సిద్దించి 75ఏళ్ళు పూర్తిచేసుకున్న సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం భారత స్వతంత్ర వజ్రోత్సవాల పేరిట ఘనంగా ఉత్సవాలను చేపట్టింది. ఆగస్ట్ 8న ఈ వజ్రోత్సవ వేడుకలను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించగా ఆగస్ట్ 22వరకు కొనసాగనున్నాయి. ప్రజల్లో దేశభక్తి పెంపొందించే ప్రత్యేక కార్యక్రమాలను ఈ పదిహేను రోజులు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా నిర్మల్ లో చేపట్టిన ఫ్రీడం రన్ ను మంత్రి ఆలోల్ల ఇంద్రకరణ్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. పట్టణంలోని ప్రాచీన శ్యాంఘడ్ కోట నుండి ఎన్డీఆర్ స్టేడియం వరకు ఈ ఫ్రీడం రన్ కొనసాగింది. స్కూల్ విద్యార్థులతో పాటు నిర్మల్ ప్రజలు భారీగా ఆ ఫ్రీడం రన్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ... స్వాతంత్ర్య పోరాట యోధులను గుర్తుచేసుకుంటూ ఈ వజ్రోత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు. పోరాట యోధులు స్పూర్తిని గుర్తచేస్తూ విద్యార్ధుల్లోనే కాదు ప్రజలందరిలో దేశభక్తి పెంపొందించేందుకు ప్రతి ఒక్కరినీ భాగస్వాములను చేస్తూ స్వతంత్ర వజ్రోత్సవ వేడుకులు జరుపుతున్నట్లు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు.