Dec 31, 2022, 12:42 PM IST
కరీంనగర్ : కరీంనగర్ లోని గంగాధరలో వింత వ్యాధితో తల్లి, కొడుకు, కూతురు 45 రోజుల వ్యవధిలో మృతి చెందారు. నిన్న రాత్రి భర్త కూడా ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. కుటుంబం మొత్తం చనిపోవడంతో మనోవేదనకు గురై అతను కూడా చనిపోయినట్లు భావిస్తున్నారు. అయితే పిల్లనిచ్చిన అత్తింటి వారి వేధింపులు, వాళ్ల చావుకు కారణం అని అనుమానంతో కేసు పెట్టారు. ఆ కేసు విచారణలో ఉండగానే అతను కూడా ఆత్మహత్య చేసుకుని మృతి చెందాడు.