Oct 12, 2022, 2:13 PM IST
పల్నాడు : అరుదైన అడవి జంతువులను స్మగ్లింగ్ చేస్తున్న ముఠా గుట్టు రట్టయ్యింది. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో అరుదైన వన్య ప్రాణులకు పట్టుకుని స్మగ్లింగ్ చేస్తున్నట్లు పక్కా సమాచారంతో ఓ ఇంటిపై ఫారెస్ట్ అధికారులు దాడి చేసారు. అయితే పోలీసులను చూసి ముఠా సభ్యులు పరారవగా ఓ మహిళ మాత్రం పట్టుబడింది. అలాగే అమ్మకానికి పెట్టిన అరుదైన అడవి జంతువు అలుగును కూడా అటవీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.