Jul 14, 2022, 11:44 AM IST
నిర్మల్ : భారీ వరదనీటితో భయాందోళన సృష్టించిన కడెం ప్రాజెక్ట్ ప్రస్తుతం శాంతించింది. ఎగువన మహారాష్ట్రతో పాటు నిర్మల్ జిల్లాలో కురిసిన భారీ వర్షాలతో కడెం ప్రాజెక్ట్ కు రికార్డుస్థాయిలో వరదనీరు చేరడంతో ఎక్కడ ప్రమాదం చోటుచేసుకుందోనని టెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రాజెక్ట్ కు ఇన్ ప్లో ఎక్కువగా వుండి ఔట్ ప్లో తక్కువగా వుండటంతో ఆందోళన ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రజలు, అధికారులు ఆందోళన పడ్డారు. అయితే ఎలాంటి ప్రమాదాలు జరక్కముందే ప్రస్తుతం వరద ప్రవాహం తగ్గడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం కడెం ప్రాజెక్ట్ కు ఇన్ ప్లో 2 లక్షల క్యూసెక్కులు వుండగా వచ్చిన నీటిని వచ్చినట్లే 17 గేట్లెత్తి దిగువకు విడుదల చేస్తున్నారు. ఇలా ప్రస్తుతానికి డ్యాం సేఫ్ జోన్ లో ఉందని అధికారులు తెలిపారు. అయితే వర్షాలు కొనసాగే అవకాశం వుందన్న హెచ్చరికల నేపథ్యంలో అధికారులు ప్రాజెక్ట్ వద్ద పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.