సింగరేణి బొగ్గుగనిలో భూమిలోంచి గ్యాస్... నల్లటి పొగతో చెలరేగిన మంటలు

Jul 22, 2022, 3:07 PM IST

పెద్దపల్లి :  సింగరేణి బొగ్గుకోసం తవ్వకాలు జరపగా భూమిలోంచి గ్యాస్ వెలువడి మంటలు చెలరేగాయి. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని ఓపెన్ కాస్ట్ 5 ప్రాజెక్ట్ లో చోటుచేసుకుంది. మంటలు బొగ్గుకు అంటుకోవడంతో మరింత చెలరేగి నల్లటి పొగలు కమ్ముకున్నాయి. మంటలతో అప్రమత్తమైన అధికారులు అవి మరింత వ్యాపించకుండా చూట్టూ బొగ్గుపై మట్టి పోసారు. అయితే బొగ్గు తవ్వకాల సయయంలో ఇలా భూగర్భంలోంచి వాయువులు వెలువడి మంటలు చెలరేగడం సర్వసాధారణమని సింగరేణి అధికారులు చెబుతున్నారు.