హైదరాబాద్ ఫతేనగర్ కి చెందిన కొందరు యువకులు పేదవారికి ఆహారంతో పాటు మూగజీవాలకూ పండ్లు అందిస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా పస్తులుంటున్న పేదవారికి ఫతేనగర్ కి చెందిన ప్రదీప్ తన స్నేహితులతో కలిసి ఆహారం పంపిణీ చేస్తున్నారు. దీంతోపాటు నర్సాపూర్ అడవుల్లోని జంతువులకు కూడా అరటిపండ్లు పంపిణీ చేస్తున్నారు. లాక్ డౌన్ వల్ల మూగజీవాలు ఆహారం దొరక్క అలమటించి పోతున్నాయని అందుకే తాము వాటికి కూడా ఫుడ్ పంపిణీ చేస్తున్నామని చెప్పారు.