Apr 24, 2020, 4:05 PM IST
సిరిసిల్ల జిల్లా, అంకిరెడ్డి పల్లె ఐకేపీ సెంటర్లో రైతులు తెచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి మిల్లర్లు రకరకాల కారణాలు చెబుతుండడంతో కడుపుమండిన రైతులు పంటకు అగ్గిపెట్టారు. ప్రతీ ధాన్యం గింజ కొనుగోలు చేస్తానన్న కేసీఆర్ మాటలు వేరు.. ఇక్కడ పరిస్థితి వేరు అంటూ వాపోతున్నారు. పుస్తె, మెట్టెలమ్మి, అప్పు చేసి వ్యవసాయం చేస్తే మిల్లర్లు దోచుకుంటున్నారంటూ ఆవేదన చెందుతున్నారు.