Nov 19, 2019, 1:40 PM IST
చిగురుమామిడి మండలం తహశీల్దార్ కార్యాలయంలో ఓ రైతు హల్ చల్ చేశాడు. సంవత్సరాలు గడిచిపోతున్నా తన భూ సమస్య పరిష్కరించడం లేదంటూ లంబడిపల్లికి చెందిన జీల కనకయ్య అనే రైతు కార్యాలయంలోని కంపూటర్లమీద, సీనియర్ అసిస్టెంట్ రాజ రామ్ చందర్, అనిత, దివ్యలపైపెట్రోల్ చల్లాడు. దీంతో భయపడ్డ సిబ్బంది బైటికి పారిపోయారు. ఈ క్రమంలో అధికారుల మీద కూడా పెట్రోల్ పడింది. అధికారుల ఫిర్యాదుమేరకు పోలీసులు కనకయ్యను అదుపులోకి తీసుకున్నారు.