చేతబడి నేర్చుకునే ప్రయత్నమే... సాప్ట్ వేర్ సజీవదహనానికి కారణం

Nov 26, 2020, 4:50 PM IST


కరీంనగర్: చేతబడి చేసి బావమరిదిని చంపాడన్న అనుమానంతో అత్తింటివారు ఓ సాప్ట్ వేర్ ఇంజనీర్ ను అతి దారుణంగా హతమార్చిన దారుణం జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. తన కళ్ళేదుటే భర్తను చంపుతున్నా భార్య కాపాడే ప్రయత్నం చేయలేదు. ఆమె మాత్రమే కాదు మూడనమ్మకాలను నమ్మి తమ కళ్లముందే కుటుంబసభ్యుడిని చంపుతున్న ఏ ఒక్కరు పట్టించుకోలేదు. ఇలా బామ్మర్ది ఫోటో ఎదుటే బావ సజీవదహనం అయ్యాడు. ఈ దారుణ సంఘటన ఈనెల 23న చోటుచేసుకోగా పోలీసుల విచారణలో సంచలన విషయాలు బయటపడుతున్నాయి.