Jun 21, 2022, 2:44 PM IST
మహబూబ్ నగర్: తెలంగాణ ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మహబూబ్ నగర్ జిల్లా పర్యటనలో భాగంగా జడ్చర్ల ప్రొహిబిషన్ & ఎక్సైజ్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ముందుగా ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే నేరుగా స్టేషన్ కు వెళ్లారు. ఈ సందర్భంగా స్టేషన్లోని అన్ని రూమ్ లను, లాక్ అప్ రూమ్ లు , స్టోర్ రూమ్, ఆఫీస్ లను పరిశీలించడంతో పాటు పరిసరాలను పరిశీలించిన మంత్రి మెయింటెనెన్స్ పై ఆసంతృప్తి వ్యక్తం చేసారు. ఆఫీసును పరిశుభ్రంగా ఉంచుకోవాలంటూ సిబ్బందికి తగు సూచనలు చేశారు. అనంతరం స్టేషన్ ప్రాంగణంలో ఉన్న సీజ్ అయిన వాహనాలపై అరా తీశారు. జిల్లాలోని అన్ని ప్రొహిబిషన్ & ఎక్సైజ్ స్టేషన్ లలో కేసులు నమోదయి సీజ్ అయిన వాహనాలను వెంటనే వేలం వేయాలని మహబూబ్ నగర్ జిల్లా డిప్యూటీ కమిషనర్ ను మంత్రి ఆదేశించారు. ఇక జడ్చర్ల స్టేషన్లోని డాలర్ ట్రీ (గిరిక తాటి చెట్లు)కి సరైన నీటి వసతి ని సమకూర్చాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ జడ్చర్ల ఎక్సైజ్ పోలీసులను ఆదేశించారు.