Oct 17, 2022, 4:35 PM IST
హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్టీ మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ బిజెపిలో చేరికకు ముహూర్తం ఖరారు చేసుకున్నారు. ఈ నెల 19వ తేదీన దేశ రాజధాని న్యూడిల్లీలోని బిజెపి కార్యాలయంలో తెలంగాణ బిజెపి చీఫ్ బండి సంజయ్, మరికొందరు కేంద్ర మంత్రుల సమక్షంలో బిజెపిలో చేరనున్నట్లు ఆయన ప్రకటించారు. మునుగోడు ఎన్నికల ముందు టీఆర్ఎస్ పార్టీకి మాజీ ఎంపీ రాజీనామా చేసి బిజెపిలో చేరడం పెద్ద ఎదురుదెబ్బే అని చెప్పాలి.