ఉపాధి హామీ కూలీలతో దయన్న మాటా మంతీ.. నేనే మీ మంత్రిని..

Apr 22, 2020, 3:53 PM IST

మ‌హ‌బాబూబాబాద్ జిల్లా పెద్ద వంగ‌ర మండ‌లం కిష్టుతండాలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఉపాధి హామీ కూలీలతో ముచ్చటించారు. వాళ్ల బాగోగులు కనుక్కున్నారు. నేనెవరో తెలుసా? మీ మంత్రి ఎవరు? అంటూ ప్రశ్నించారు.  కిష్టు తండాలో ఉపాధి హామీ పథకం కింద జరుగుతున్న కాలువ శుభ్రం చేసే ప‌నులు జరుగుతున్నాయి. ఆ కూలీలను ఉపయోగపడే పనులే చేయమని చెప్పి, కరోనా గురించి తెలుసా అని అడిగారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలిపారు. తనకెదురైన చిన్నబాబుకు నమస్కారం చేసి బాబూ...! బాగున్న‌వా?! అంటూ పలకరించాడు.