Oct 21, 2022, 4:46 PM IST
హైదరాబాద్ : మునుగోడు ఉపఎన్నిక వేళ బిజెపిని దెబ్బతీసేందుకు పక్కా వ్యూహంతో ముందుకెళుతోంది టీఆర్ఎస్. ఇందులో భాగంగానే గతంలో టీఆర్ఎస్ ను వీడి ప్రస్తుతం బిజెపిలో కొనసాగుతున్న నాయకులను ఒక్కొక్కరుగా తిరిగి సొంతగూటికి చేరుస్తున్నారు. ఇలా ఇప్పటికే మాజీ ఎమ్మెల్సీ స్వామి గౌడ్, దాసోజు శ్రవణ్ లు బిజెపికి రాజీనామా ప్రకటించి మరికొద్దిసేపట్లో టీఆర్ఎస్ లో చేరనున్నారు. ఈ క్రమంలోనే ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి కూడా తిరిగి టీఆర్ఎస్ లో చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారాన్ని తాజాగా రవీందర్ రెడ్డి ఖండించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ బిజెపి నాయకులు టీఆర్ఎస్ లో చేరుతున్నారంటూ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని రవీందర్ రెడ్డి మండిపడ్డారు. ఉద్యమ ద్రోహుల పార్టీ టీఆర్ఎస్ పై తూ అని ఉమ్మేసి వచ్చానని... అలాంటిది తిరిగి వెళతానని ప్రచారం చేయడం దారుణమన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బిజెపిలోనే కొనసాగుతానని ఏనుగు రవీందర్ రెడ్డి స్పష్టం చేసారు.