Peddapalli Accident:ఎనిమిదేళ్ల చిన్నారిని బలితీసుకున్న రోడ్డు ప్రమాదం

Jan 31, 2022, 1:24 PM IST

పెద్దపల్లి: మరికొద్ది నిమిషాల్లో ఇటికి చేరతారనగా ఓ కుటుంబం ప్రయాణిస్తున్న వాహనం రోడ్డుప్రమాదానికి గురయ్యింది. ఇందులో ఓ ఎనిమిదేళ్ల చిన్నారి మృతిచెందగా కుటుంబమంతా గాయాలపాలై హాస్పిటల్ లో చికిత్ప పొందుతున్నారు. ఈ  ఘోరం పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. 

పెద్దపల్లి పట్టణంలోని 2వ వార్డు కౌన్సిలర్ పస్తం హనుమంతు కుటుంబ సభ్యులతో కలిసి బొలేరో వాహనంలో మంచిర్యాల వెళ్లాడు. తిరిగివస్తున్న సమయంలో వీరు ప్రయాణిస్తున్న బొలేరో వాహనాన్ని ఓ లారీ ఢీకొట్టింది. దీంతో తనుశ్రీ(8) అనే చిన్నారి అక్కడిక్కడే మృతిచెందింది. మిగతా కుటుంబసభ్యులు కూడా తీవ్రంగా గాయపడగా వీరిలో శివ ప్రసాద్ పరిస్థితి విషమం వున్నట్లు సమాచారం. క్షతగాత్రులందరినీ మెరుగైన చికిత్స కొసం కరీంనగర్ ఆసుపత్రి తరలించారు.