Telangana

బోనాల జాతరలో మంత్రి ఈటెల (వీడియో)

22, May 2019, 4:22 PM IST

కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం నాగంపేట గ్రామంలో బీరన్న బోనాల జాతరలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల.రాజేందర్ పాల్గొన్నారు. గొల్ల, కురుమలు డప్పు వాయిద్యాలు, కోలాటాలతో మంత్రి ఈటల కు ఘన స్వాగతం పలికారు . బీరన్న ఉత్సవాల్లో భాగంగా మంత్రి మొక్కులు చెల్లించుకున్నారు.

బీరన్న దేవాలయం అనేది గ్రామ పోలిమేరలో ఉండి గ్రామ ప్రజలకు, గొల్ల కురుమల వారికి గ్రామంలో అసంఘటిత శక్తులు రాకుండా కాపాడుతుందని మంత్రి ఈటెల ఈ సందర్భంగా అన్నారు. గ్రామంలో ఉన్న గొల్ల, కురుమ వారికి  శుభాకాంక్షలు తెలిపారు. బీరన్న గుడికి తన వంతు కృషిగా గుడి చుట్టూ ప్రహరీ గోడను నిర్మిస్తామని చెప్పారు.