Aug 23, 2022, 5:00 PM IST
విజయవాడ : ఆంధ్ర ప్రదేశ్ లో విద్యాసమస్యల పరిష్కారంకోసం విద్యార్థి సంఘాలు చేపట్టిన రాష్ట్ర బంద్ ఎన్టీఆర్ జిల్లాలో ఉద్రిక్తంగా మారింది. విజయవాడ మొగల్రాజపురంలోని బోయపాటి పాఠశాల ఎదుట విద్యార్థి సంఘాల ఆందోళన చేపట్టగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, విద్యార్థి సంఘాల నాయకులకు మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంలో విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు ఈడ్చుకెళ్లి అరెస్ట్ చేసారు. ఇక విశాఖపట్నంలోనూ ఎస్ఎఫ్ఐ, ఎఐఎస్ఎఫ్, పిడిఎస్వో, ఎఐడిఎస్వో విద్యార్ధి సంఘాట ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. నిరసనలో భాగంగా విశాఖ మహిళ డిగ్రీ కాలేజీనుండి జివిఎంసి గాంధీ విగ్రహం వరకు విద్యార్థులు రాలి నిర్వహించారు.