Nov 9, 2022, 1:52 PM IST
కరీంనగర్ : తెలంగాణ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఇల్లు, కార్యాలయాలతో పాటు బంధువులు ఇళ్లపైనా ఈడి, ఐటీ సంయుక్తంగా దాడి చేస్తోంది. గ్రానైట్ మైనింగ్ లో అక్రమాలు, మనీ లాండరింగ్ కు పాల్పడుతూ ఫెమా యాక్ట్ ఉల్లంఘనకు పాల్పడుతున్నట్లుగా ఫిర్యాదుల నేపథ్యంలో గ్రానైట్ వ్యాపారులపై ఈ దాడులు చేపట్టారు. ఈ క్రమంలోనే మంత్రి గంగుల ఇల్లు, కార్యాలయాల్లోనూ ఈడి, ఐటీ దాడులు చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ దాడుల సమయంలో మంత్రితో పాటు ఆయన కుటుంబసభ్యులెవ్వరూ ఇంట్లో లేనట్లు తెలుస్తోంది. మంత్రి గంగులతో పాటు ఐదు గ్రానైట్ మైనింగ్ పరిశ్రమల కార్యాలయాల్లోనూ ఈడి, ఐటి సోదాలు కొనసాగుతున్నాయి. ఉదయం నుండి హైదరాబాద్, కరీంనగర్ లోని దాదాపు 30 ప్రాంతాల్లో ఈ రైడ్స్ జరుగుతున్నట్లు సమాచారం.