కరీంనగర్ లో ఈడీ, ఐటీ జాయింట్ ఆపరేషన్... గ్రానైట్ వ్యాపారి ఇంట్లో సోదాలు

Nov 9, 2022, 2:18 PM IST

కరీంనగర్ : మైనింగ్ అక్రమాలకు సంబంధించి తెలంగాణలో ఈడి (ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్), ఐటి జాయింట్ ఆపరేషన్ చేపట్టింది. ఇవాళ ఉదయం నుండి హైదరాబాద్ తో పాటు కరీంనగర్ జిల్లాలో దాదాపు 30 చోట్ల ఈడీ, ఐటీ రైడ్స్ చేపట్టింది. ఇలా కరీంనగర్ కమాన్ ప్రాంతంలోని అరవింద్ గ్రానైట్ సంస్థ యజమాని అరవింద్ వ్యాస్ ఇంట్లోనూ ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఇలా హైదరాబాద్ శివారులోని రాజేంద్రనగర్ జనప్రియ అపార్ట్ మెంట్ లోని వ్యాపారి శ్రీధర్ ఆఫీస్ లోనూ ఈ సోదాలు కొనసాగుతున్నాయి.