బిజిగిరి షరీఫ్‌ దర్గాలో ఉర్సు ఉత్సవాలు... ఈటల రాజేందర్ ప్రత్యేక ప్రార్థనలు

Jul 22, 2021, 12:58 PM IST

కరీంనగర్: ప్రజా దీవెన యాత్ర పేరిట హుజురాబాద్ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న మాజీ మంత్రి, బిజెపి నాయకుడు ఈటల రాజేందర్ జమ్మికుంట మండలంలోని బిజిగిరి షరీఫ్‌ దర్గాలో జరుగుతున్న ఉర్సు ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు ఈటల. హజ్రత్‌ సయ్యద్‌ అంకుషావలి, మూర్తుజాషావలీ, అక్బర్‌షావలీ సంస్మరణార్థం బిజిగిరి షరీఫ్‌ దర్గాలో బక్రీద్‌ పర్వదినం నుండి సుమారు వారం రోజుల పాటు ఉర్సు ఉత్సవాలు జరుగుతాయి. 

నాలుగోరోజు ఈటల పాదయాత్ర ఇళ్ళందకుంట మండలంలో జరుగుతోంది. మర్రివానిపల్లి గ్రామం నుండి సీతంపేట గ్రామానికి ఈటల పాదయాత్ర సాగుతోంది. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఈటల పాదయాత్రగా ముందుకు సాగుతున్నారు.