ఏపీ నుండి తెలంగాణకు... ఆ వాహనాలకే అనుమతి: నల్గొండ డిఐజి క్లారిటీ

May 24, 2021, 5:27 PM IST

  నల్గొండ: అంతరాష్ట్ర సరిహద్దుల వద్ద లాక్ డౌన్ మినహాయింపు సమయంలోనూ ఈ పాస్ ఉంటేనే అనుమతిస్తామని నల్లగొండ డిఐజి రంగనాథ్ తెలిపారు.  ఉదయం 6.00 నుండి 10.00 గంటల వరకు ఇతర రాష్ట్రాల నుండి వచ్చే వాహనాలు విధిగా ఈ పాస్ కలిగి ఉంటేనే అనుమతిస్తామన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఈ పాస్ పొందలేని వారు సరైన ఆధారాలు చూపించడం, అత్యవసర వైద్యం కోసం వచ్చినట్లయితే విచారించి అలాంటి వాహనాలను మానవతా దృక్పథంతో అనుమతిస్తామన్నారు. తెలంగాణ లేదా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం, పోలీసులు జారీ చేసిన పాస్ ఉంటేనే అనుమతిస్తామన్నారు. కానీ అంబులెన్సులకు ఎలాంటి ఆంక్షలు లేవన్నారు. ప్రైవేట్ వాహనాలలో ఆంధ్రా నుండి తెలంగాణకు వచ్చే కోవిడ్, ఇతర రోగులు ఆస్పత్రుల నుండి ఇచ్చిన లెటర్స్, సంబంధిత పత్రాలు ఉంటేనే అనుమతిస్తామన్నారు.