Jul 29, 2022, 2:04 PM IST
శ్రావణ శుక్రవారం సందర్భంగా రాజన్న సిరిసిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. ఇవాళ తెల్లవారుజామునుండి భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. నేటి నుండి నెలరోజల పాటు శ్రావణమాస వేడుకలను నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ నెలలోని నాలుగు సోమవారాలు మహాన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకం, మహాలింగార్చన నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇక ప్రతి శుక్రవారం రాజరాజేశ్వరి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు రాజన్న ఆలయ అధికారులు తెలిపారు. శ్రావణమాసంలో స్వామివారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు వస్తారని... అందుకు తగినట్లు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.