Dec 13, 2022, 8:40 PM IST
కరీంనగర్ : జనావాసాలను చుట్టేసిన ఈ పొగమంచును చూసి ఏ సిమ్లానో, కాశ్మీరో అనుకుంటే పొరపడినట్లే. మాండూస్ తుఫాను ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లోనూ ఉష్ణోగ్రతలు భారీగా తగ్గి పొగమంచు కమ్మేస్తోంది. ఇలా కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఉదయం దట్టమైన పొగమంచు కమ్మేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఉదయం 9-10 గంటల వరకు ఇలాగే పొగమంచు కురుస్తుండటంతో స్కూళ్లకు వెళ్లే విద్యార్థులు, ఆఫీసులకు, వ్యాపార పనులపై బయటకు వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పొగమంచుతో ప్రమాదాలు జరిగే అవకాశాలుండటంతో వాహనదారులు జాగ్రత్తగా వుండాలని అధికారులు సూచిస్తున్నారు.