Nov 14, 2022, 10:15 AM IST
హైదరాబాద్ : అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నించారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న నందకుమార్ అలియాస్ నందు కు జిహెచ్ఎంసి అధికారులు షాకిచ్చారు. హైదరాబాద్ ఫిలింనగర్ లో నందు కుటుంబం నిర్వహిస్తున్న డెక్కన్ కిచెన్ హోటల్ ను అక్రమంగా నిర్మించారంటూ జిహెచ్ఎంసి అధికారులు కూల్చేసారు. అయితే తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే హోటల్ కూల్చివేత చేపట్టడంపై నందకుమార్ భార్య, కొడుకు ఆందోళన వ్యక్తంచేసారు. కూల్చివేత సమయంలో జిహెచ్ఎంసి అధికారులతో నందకుమార్ కుటుంబసభ్యులు వాగ్వివాదానికి దిగారు.