గవర్నర్ విధానాన్ని ఓడించి తన విధానాన్ని గెలిపించుకున్నారు తమిళిసై: సిపిఐ నారాయణ

Jun 10, 2022, 3:36 PM IST

హైదరాబాద్ : ప్రజలచేత ఎన్నిక కాబడిన ప్రభుత్వం వుండగా తెలంగాణ గవర్నర్ తమిళిసై మహిళా దర్బార్ నిర్వహించడాన్ని సిపిఐ నారాయణ తప్పుబట్టారు. ఇది ఒక గవర్నర్ చేయాల్సిన పని కాదన్నదే తన అభిప్రాయమన్నారు. ఆమె గవర్నర్ విదానాన్ని ఓడిచింది తన విధానాన్ని గెలిపించుకున్నారని అన్నారు. కేసీఆర్ నియంత‌ృత్వ పద్దతులతోనే ఈ పరిస్థితి వచ్చిందని... ఇది ప్రమాద సంకేతమన్నారు. ఇవాళ  గవర్నర్ చేపట్టిన ప్రజాదర్బారును చూసయిని కేసీఆర్ లో మార్పు రాకపోతే ఇంకా ప్రమాదంలో పడతాడని సిపిఐ నారాయణ హెచ్చరించారు.